కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్
x
Highlights

కాసేపట్లో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కానున్నారు.

కాసేపట్లో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్ తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, అమరావతిలో రైతుల ఆందోళనపై గవర్నర్ తో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మరోవైపు, అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ పై రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ పెద్దలు వీడియో ప్రదర్శనను ఇస్తారని తెలుస్తోంది. అమరావతిలో నాయకుల కుంభకోణం వివరాలను రాజధాని పేరిట కొనుగోలు చేసిన భూముల వివరాలను ప్రభుత్వం బయటపెట్టనుంది. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం తెల్లవారుజామున సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వీడియో ప్రదర్శన గురించి అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా ఈ నివేదికను ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ప్రకారం, టీడీపీ నాయకులు అమరావతిలో దాదాపు 4,075 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదిలావుంటే అమరావతిలో రైతుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories