రేపు వైసీపీకి ప్రత్యేకమైన రోజు.. రాష్ట్ర ప్రజలకు థాంక్స్ చేప్పిన జగన్

రేపు  వైసీపీకి ప్రత్యేకమైన రోజు.. రాష్ట్ర ప్రజలకు థాంక్స్ చేప్పిన జగన్
x
ys Jagan File Photo
Highlights

కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మార్చి 12వ తేదీతో పది సంవత్సరాలు కాబోతోంది. ఎంపీ పదవికి రాజీనామా...

కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మార్చి 12వ తేదీతో పది సంవత్సరాలు కాబోతోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్ జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి 2010 మార్చి 12 వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించారు. ఈ పదేళ్ల ప్రయాణంలో వైసీపీ ఎన్నో ఎత్తుపళ్లాలను చవిచూసింది. 8ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని 151 ఎమ్మెల్యేలను గెలిపించి భారీ విజయం కేటాయించారు.

వైసీపీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఓ ట్వీట్ చేశారు. మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని సీఎం జగన్ ఆ ట్వీట్‌లో కోరారు.



Show Full Article
Print Article
Next Story
More Stories