కేబినెట్‌లోకి మళ్లీ కొడాలి నాని..?

CM YS Jagan Serious On Ministers
x

కేబినెట్‌లోకి మళ్లీ కొడాలి నాని..?

Highlights

*సీఎం జగన్‌ మంత్రులపై సీరియస్ అవ్వడంతో.. పార్టీ వర్గాల్లో, మంత్రివర్గంలో కొత్త చర్చ

Andhra Pradesh: ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చ తెరమీదకొచ్చింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో మంత్రులపై సీఎం జగన్ సీరియస్ కావడంతో.. పార్టీ వర్గాల్లో, మంత్రివర్గంలో కొత్త చర్చ జరుగుతోంది. త్వరలో కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ మొదలయ్యింది. మంత్రివర్గం నుంచి ముగ్గురికి ఉద్వాసన తప్పదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ముగ్గురి ప్లేస్‌లో మాజీలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, అనిల్ కుమార్‌లకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్నినానిలను తప్పించి.. తప్పు చేశామన్న భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. జగన్‌ టీమ్‌లో ట్రబుల్‌ షూటర్‌గా ఈ ముగ్గురికి పేరుంది. చంద్రబాబు, లోకేష్, మిగతా టీడీపీ నేతలను కట్టడి చేయడంలో వీరు సక్సెస్‌ అయ్యారని.. ఇందులో భాగంగానే మళ్లీ ఈ ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories