సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దమామ కన్నుమూత

సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దమామ కన్నుమూత
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమామ ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన సీఎం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమామ ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డికి పెద్దనాన్న అవుతారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి.. పులివెందులలోని ఓ ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స పొంది ఇటీవల స్వగ్రామం అయిన వేముల మండలం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం పులివెందులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

దీంతో పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని తిరిగి గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. జగన్ తల్లి , వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, అలాగే సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గొల్లలగూడూరు చేరుకుని పెద్ద గంగిరెడ్డి భౌతికఖాయానికి నివాళులు అర్పించారు. కాగా ఈసీ చిన్న గంగిరెడ్డి, సుగుణమ్మ దంపతులు కుమార్తె వైఎస్ భారతిరెడ్డి.. గంగిరెడ్డి దంపతులు పులివెందులలో పేరొందిన వైద్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories