సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం

సీఎం జగన్‌కు అమెరికాలో ఘన స్వాగతం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి బయలుదేరిన ఆయన ఇవాళ సాయంత్రం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి బయలుదేరిన ఆయన ఇవాళ సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌) అలాగే ప్రవాసాంధ్రులు ఆయనకు డల్లాస్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల సీఎం జగన్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే సొంత ఖర్చులతో పర్యటన సాగించనున్నారు. ఆయన వెంట ఎంపీలు మిదున్ రెడ్డి, మార్గని భరత్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కొట్టారు అబ్బయ్య చౌదరి ఇంకా మరికొంతమంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories