నేడు మరోసారి పులివెందులకు సీఎం జగన్

నేడు మరోసారి పులివెందులకు సీఎం జగన్
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మరోసారి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మరోసారి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్‌ గంగిరెడ్డి సంస్మరణ సభ ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరగనుంది. ఈనేపథ్యంలో సంస్మరణ సభకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.. ఈ సందర్బంగా గంగిరెడ్డికి నివాళులు అర్పించనున్నారు.

అందుకోసం ఉదయం 9.00 ముఖ్యమంత్రి తాడేపల్లెలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టునుంచి విమానంలో కడప ఎయిర్‌ పోర్టుకు బయలుదేరుతారు సీఎం. ఉదయం 10.10 కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 10.15 కడప ఎయిర్‌ పొర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో పులివెందులకు బయలు దేరుతారు. 10.50 భాకారాపురంలోని నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం వరకూ జరిగే సంస్మరణ సభలో పాల్గొంటారు. ఆ తరువాత కార్యక్రమం ముగిసిన అనంతరం 1.00 పులివెందుల నుంచి కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకొని విమానం ఎక్కి 2.20 గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 2.30 గన్న వరం ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా ఢిల్లీ వెళతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories