మూడో స్థానంలో నిలిచిన సీఎం జగన్

మూడో స్థానంలో నిలిచిన సీఎం జగన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరో గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరో గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయనకు మూడో స్థానం దక్కింది. 'దేశ్‌ కా మూడ్‌' పేరిట చేపట్టిన సర్వేలో 71 శాతం మంది జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది. ఆయన 'నవరత్నాలు' జాతీయ స్థాయిలో వివిధ వర్గాల వారిని ఆకర్షించాయని తెలిపింది. ఇక మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ , రెండో స్థానంలో యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదోస్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories