వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. ఫోన్ లో పరామర్శించిన సీఎం

వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. ఫోన్ లో పరామర్శించిన సీఎం
x
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నంబూరు శంకరరావు
Highlights

పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు ఇంట విషాదం నెలకొంది.

పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయనతల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీకాంతమ‍్మ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఎమ్మెల్యే శంకరరావును పరామర్శించారు. పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకనేతలు శంకరరావును పరామర్శించి, సంతాపం తెలిపారు.

కాగా 2018 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శంకర్ రావు తొలిప్రయత్నంలోనే పెదకూరపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర రాజ‌ధానికి గుంటూరు జిల్లాలోని కీల‌క‌ అసెంబ్లీ నియోజకవర్గం అయిన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకున్నారు. వైసీపీ కీలకనేత కావటి శివనాగమనోహర్ నాయుడును కాదని శంకర రావుకు టికెట్ కేటాయించారు సీఎం జగన్. ఆయన 2019 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories