జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వాటికి రూ.16 వేల కోట్లు ఖర్చు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వాటికి రూ.16 వేల కోట్లు ఖర్చు
x
YSJagan(File Photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నాడు - నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నాడు - నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల నిర్మించడానికి స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు- నేడు కార్యక్రమం కింద ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించేందుకు చేపట్టే పనులపై జూన్‌ నెలలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కొత్త నిర్మాణాల కోసం 16 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నాడు- నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నాడు- నేడు కార్యక్రమం భవిష్యత్తు తరాలనూ దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలిపారు. నాడు- నేడు కింద చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని కోరారు.

ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా... ప్రజలను రక్షించడానికి ఉపయోగపడతాయని, ఇందు కోసం మంచి వ్యూహాలను ఎంపిక చేయాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో నాడు- నేడు కింద చేపట్టబోయే పనులు చరిత్రాత్మకం అవుతాయని సీఎం అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ గురించి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించడం లేదన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం మాత్రం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories