నవంబర్‌ 7న సీఎం గుంటూరు పర్యటన

నవంబర్‌ 7న సీఎం గుంటూరు పర్యటన
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న గుంటూరుకు వెళుతున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న గుంటూరుకు వెళుతున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుక్రవారం చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల అందజేయనున్నారు.

కాగా అగ్రిగోల్డ్‌ బాధితులకు తొలి విడతగా రూ.264.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. రూ.10వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి ఈ డబ్బు ఇవ్వనుంది. ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా 3.69లక్షల మందిని ఎంపిక చేశారు. గుంటూరు జిల్లాలో 19,751 మంది బాధితులు ఉన్నారు. ఈ క్రమంలో సీఎం గుంటూరులో జరిగే కార్యక్రమంలో చెక్కుల పంపిణీ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories