Top
logo

వాలంటీర్ల ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్‌

వాలంటీర్ల ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్‌
Highlights

ఏపీలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు....

ఏపీలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా వాలంటీర్లకు ఆయన దిశానిర్ధేశం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని అన్నారు. 'గడిచిన 73 ఏడేళ్లలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంకా స్వాతంత్య్రానికి దూరంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉండాలి. దానిలో భాగమే గ్రామ వాలెంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. కుల, మత రాజకీయాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. కాగా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లు పనిచేస్తారు.

Next Story


లైవ్ టీవి