నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌.. భారీగా ఏర్పాట్లు..

నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌.. భారీగా ఏర్పాట్లు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే కేంద్ర ప్రకటించిన నగదుతో విశాఖ నగరంలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం రెండున్నరకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్తారు.

నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌.. భారీగా ఏర్పాట్లు..కైలాసగిరి వద్ద దాదాపు రూ. 40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కుకు చేరుకుంటారు. అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే అక్కడ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం రామకృష్ణ బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌-2019 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.

మరోవైపు విశాఖ ఉత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.. శని ఆది వారాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. ముందుగా శనివారం మధ్యాహ్నం బీచ్‌ రోడ్‌లోని పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి కార్నివాల్‌ ప్రారంభమవుతుంది. ఈ సందర్బంగా శకటాలు, వివిధ కళారూపాలు, జానపదాలు ఇందులో ప్రదర్శితం కానున్నాయి.. అనంతరం సాయంత్రం 5.30కు ఆర్కే బీచ్‌లో ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు..

ఇదిలావుంటే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా చేస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో తొలిసారి ముఖ్యమంత్రి విశాఖ రానుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో సీఎం జగన్ కు ఘనంగా స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖలో అధికాలు అప్రమత్తమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories