logo
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై జగన్‌ సమీక్ష

భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై జగన్‌ సమీక్ష
X
Highlights

ఏపీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఏపీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్ వాడి కేంద్రాల్లో నాడు- నేడు అమలు అవుతున్న తీరు, గ్రామ సచివాలయాలు, ఆర్‌వీకేలు, వీలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ సూచించారు. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. వారికి వెంటనే సాయం చేయండని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కుటుంబాలకు 5లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. వర్షంలో నష్టపోయిన పంటల గురించి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరూ అక్టోబర్ 31 వరకు అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టాలని ఆర్‌ అండ్ బీ, పంచాయతీ రాజ్‌ శాఖలు ఫోకస్ పెట్టాలన్నారు. ఈ నెల 27న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు..

Web TitleCM Ys jagan Mohan reddy review meeting on over floods in andhrapradesh
Next Story