'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభించిన సీఎం జగన్‌
x
Highlights

'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌ 'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌

అనంతపురం జిల్లాలో 'వైఎస్ఆర్ కంటి వెలుగు' పధకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్లనాని తో కలిసి ప్రారంభించారు. అంతకుముందు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్‌ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. ఇక అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఈ పధకాన్ని ప్రారంభించారు.

కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నెల్లూరు జిల్లాలో కలెక్టర్‌ శేషగిరిబాబు, ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రారంభించారు. అలాగే జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఈ పధకంలో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ కంటి పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన పరికరాలను అన్ని జిల్లాలకు పంపించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories