విద్యార్థినితో కలిసి 'మనబడి నాడు-నేడు' ప్రారంభించిన సీఎం జగన్‌

విద్యార్థినితో కలిసి మనబడి నాడు-నేడు ప్రారంభించిన సీఎం జగన్‌
x
Highlights

బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ గురువారం ఒంగోలు స్థానిక పివిఆర్...

బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ గురువారం ఒంగోలు స్థానిక పివిఆర్ బాలుర పాఠశాలలో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు వైయస్ జగన్. తరువాత విద్యార్థినితో కలిసి దీపం వెలిగించి నాడు-నేడు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు జగన్ డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు స్టాల్ ను సందర్శించి ఈ పథకం ఎలా అమలు జరుగుతుందో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ .12 వేల కోట్లు కేటాయించింది. మొదటి దశలో తొమ్మిది సౌకర్యాలతో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పాఠశాలల కోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన తొలి సిఎం వైయస్ జగన్ అవుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories