రఘురామకృష్ణంరాజుపై త్వరితగతిన అనర్హత : ఎంపీ మిథున్ రెడ్డి

రఘురామకృష్ణంరాజుపై త్వరితగతిన అనర్హత : ఎంపీ మిథున్ రెడ్డి
x
Highlights

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. డిల్లీలో ఉన్న ఎంపీలతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనకై ఎంపీలు గట్టిగా పోరాడాలని సీఎం సూచించారు. ఈ సందర్బంగా భేటీ వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదా గురించి సభలో మాట్లాడాలని సీఎం సూచించారని చెప్పారు.. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని సీఎం జగన్ నిర్దేశం చేశారని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ను వేగవంతం చేశామని అన్నారు. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామని అన్నారు. అలాగే జిఎస్టి పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం అని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం సూచించారని తెలియజేశారు. జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని.. సిఆర్డిఏ, ఫైబర్ గ్రిడ్ లపై వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాలని కోరతామన్నారు. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని.. అలాగే రఘురామకృష్ణంరాజు పై త్వరితగతిన అనర్హత వేటు వేయాలని కూడా కోరతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories