Top
logo

చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..రాజీనామా చేసి వెళ్లిపోతారా..

చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..రాజీనామా చేసి వెళ్లిపోతారా..
Highlights

ఏపీ అసెంబ్లీలో సున్నా వడ్డీ రుణాల అంశం మాటల మంటలు రేపింది. కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యుడు...

ఏపీ అసెంబ్లీలో సున్నా వడ్డీ రుణాల అంశం మాటల మంటలు రేపింది. కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యుడు రామానాయుడు తమ హయంలో కూడా రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చామన్నారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార పక్షం ఐదేళ్లలో సున్నా వడ్డీకి ఎంత ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం జగన్ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తారా ? అంటూ సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇవ్వలేదని రికార్డులు స్పష్టం చేస్తే.. చంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోతారా? అని జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. రికార్డులు చూపితే తక్షణమే తెప్పిస్తానంటూ సభలో ప్రకటించారు. జగన్ ప్రకటనపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు పాలనపరమైన అంశాలు తెలియకుండా మాట్లాడితే ఎలాగన్నారు. పాదయాత్ర ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.లైవ్ టీవి


Share it
Top