పులివెందుల ప్రజలకు సీఎం జగన్ వరాలు

పులివెందుల ప్రజలకు సీఎం జగన్ వరాలు
x
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో చేయబోయే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పులివెందుల‌లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా పులివెందుల ప్రజలకు సీఎం వరాలు కురిపించారు. పులివెందుల, బెంగుళూరు రోడ్డును వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. పులివెందులకు నీటి ఎద్దడిని తీర్చేందుకు పలు ప్రాజెక్టుల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు జగన్. పులివెందులలో మినీ సచివాలయం, నూతన గ్రామా/వార్డు సచివాలయాల నిర్మాణానికి పునాది రాయి వేశారు. అలాగే రూ.100 కోట్లతో పులివెందుల అండర్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసిన వాటి వివరాలు..

వేంపల్లెలో రూ.63 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు

♦ జేఎన్‌టీయూలో రూ.20 కోట్లతో లెక్చరర్‌ కాంప్లెక్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

♦ రూ.347 కోట్లతో వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

♦ గాలేరు- నగరి సుజల స్రవంతి మెయిన్‌ కెనాల్‌ నుంచి అలవలపాడు ట్యాంక్, వేముల, వేంపల్లె మండలాలకు నీరందించే ఎత్తిపోతల పథకం.

♦ చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

♦ రూ.65కోట్లతో పులివెందులలో నీరందించే ఇంటిగ్రెటేడ్‌ స్కీం

ఇక అంతకుముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌, విజయమ్మ, వైఎస్‌ భారతి ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌, విజయమ్మ కేక్‌ కట్‌ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరింపజేశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్‌, అవంతి శ్రీనివాస్‌, ఆళ్ల నాని, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories