రాష్ట్రంలో ఏసీబీ పనితీరు బాగోలేదు

రాష్ట్రంలో  ఏసీబీ పనితీరు బాగోలేదు
x
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Highlights

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏసీబీపై సమీక్షా సమావేశం నిర్వహించారు జగన్.

ఈ సందర్బంగా ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా అంకిత భావంతో పని చేయాలని అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన తరువాత వందలాది ఫిర్యాదులు అందుతున్నా వాటిపై లేట్ గా రెస్పాండ్ అవుతున్నట్టు సమాచారం అందుతుందని అన్నారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలి.

ప్రజలెవ్వరూ కూడా అవినీతిపై మళ్ళీ మళ్ళీ లంచాలు తీసుకుంటున్నారు అంటూ ఫిర్యాదు చేయకూడదు అని సూచించారు. ఎమ్మార్వో, కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి. రాబోయే మూడు నెలల్లోగా కచ్చితంగా మార్పు కనిపించాలని.. అవసరమైతే సిబ్బందిని ఎంత మందిని కావాలన్నా ఇస్తానని అధికారులకు చెప్పారు. మరో నెల రోజుల తరువాత ఏసీబీపై సమీక్ష చేస్తాం.. అప్పటికి తేడా కనిపించకపోతే చర్యలు తప్పవని అన్నట్టు తెలుస్తోంది. సమీక్షా సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏసీబీ డీజీ కుమార్‌ విశ్వజిత్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories