CM Jagan: పోర్టు పనులను ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM Jagan Will Start the Port Works
x

CM Jagan: పోర్టు పనులను ప్రారంభించనున్న సీఎం జగన్‌

Highlights

CM Jagan: పోర్టు తొలిదశ పనుల కోసం రూ.3736.14 కోట్లు కేటాయింపు

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించనున్నారు. సీఎం రాకతో తీరప్రాంతం పోర్ట్ ఏరియాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్‌ ల్యాండ్ కానుంది. ముందుగా సముద్రుడికి పూజలు చేయనున్న సీఎం జగన్ ఆ తర్వాత పోర్ట్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరుగనుంది. పోర్టు తొలిదశ పనులు 36నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పోర్టు తొలిదశ పనుల కోసం 3వేల 7వందల 36 కోట్ల 14 లక్షలను కేటాయించారు. రాష్ట్రం ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్ట్ ను రామాయపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. తొలి దశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి, కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇక రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories