CM Jagan: విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్‌

CM Jagan will Release Jagananna Vidya Deevena today
x

CM Jagan: విద్యాదీవెన నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్‌

Highlights

CM Jagan: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9 లక్షల,32వేల, 235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో బటన్‌ నొక్కి 680.44 కోట్లను 8లక్షల,44వేల,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు.

ఇదే సందర్భంలో నగరిలో సుమారు 31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కాలేజీలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది.

హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories