గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్‌

CM Jagan will Participate in the Global Investor Preparatory Conference
x

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సన్నాహక సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్‌

Highlights

CM Jagan: విశాఖలో మార్చిలో నిర్వహించే సమ్మిట్ కోసం ఢిల్లీలో కర్టెన్‌రైజర్ మీటింగ్

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఇవాళ జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఇందుకోసం జగన్ నిన్నరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. సీఎంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య సహా పలువురు అధికారుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో విదేశీ దౌత్యవేత్తలతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో జగన్ ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు- గవర్నమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories