CM Jagan: నేడు 146 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM Jagan Will Launch New Ambulances Today
x

CM Jagan: నేడు 146 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

Highlights

CM Jagan: 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసిన జగన్ సర్కార్

CM Jagan: 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌‌లను సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా అప్పట్లో 96.50 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్న­వాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం 4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.

ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో... కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా 34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం 188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్‌ ఉండగా ప్రస్తుతం 74వేల 609 మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories