CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan visit to Srikakulam District Today
x

CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Highlights

CM Jagan: సంతబొమ్మాళి మం. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి.. శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గంటల 15 నిమిషాలకు మూలపేటకు చేరుకొని.. 10గంటల 47 నిమిషాలకు పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన అనంతరం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత నౌపడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుంటారు. పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసి.. అక్కడి నుంచే వర్చువల్ విధానం ద్వారా వంశధార లిఫ్ట్ ఏర్పాటు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సుమారు 4వేల 500 కోట్ల రూపాయలు, 12.17 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్ నిర్మాణం మొదటిదశ 2026 కల్లా పూర్తి చేయనున్నారు. తరువాత 15 సంవత్సరాలలో 68.5 మిలియన్ టన్నులు కెపాసిటీతో విశాఖ పోర్ట్ కన్నా పెద్ద పోర్ట్‌గా రూపొందించనున్నారు. ఇక వంశధార రిజర్వాయర్‌లో సైడ్ వీయర్ ద్వారా నీటిని నింపలేక, 2 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం జరిగింది. ఒరిస్సాతో విభేదాలు తీరి, నేరడి బ్యారేజి నిర్మించేంత వరకు వంశధార రిజర్వాయర్‌ నిరుపయోగంగా ఉంటుందని, దీనిని అధిగమించడానికి గొట్ట బ్యారేజి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తీసుకొచ్చారు. దీనివల్ల సుమారు 2.5 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగు, తాగునీరు అందనున్నాయి.

3 వేల కోట్ల రూపాయలతో భావనపాడు పోర్ట్‌ నిర్మాణం జరుగుతోందన్నారు మంత్రి అమర్నాథ్‌. 9 ఫిషింగ్‌ హార్బర్స్ నిర్మిస్తున్నామని.. ఎచ్చర్లలో ఫిషింగ్‌ హార్బర్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మే 3న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశం కేంద్ర పరిధిలో ఉందని మంత్రి తెలిపారు.

సీఎం పర్యటన నేపథ్యంలో సుమారు 2వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పించారు. ఇప్పటికే నౌపడా బహిరంగ సభ వద్ద, మూలపేట పైలాన్, సముద్రతీర ప్రాంతం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories