CM Jagan: ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ పర్యటన

CM Jagan Visit to Kurnool District Adoni Today
x

CM Jagan: ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం పర్యటన

Highlights

CM Jagan: జగనన్న విద్యాదీవెన ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనన్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఏపీ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్, ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురామ్, జిల్లా కలెక్టర్ కోటేశ్వర్ రావుస, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ దగ్గర సీఎం సభా వేదిక ఏర్పాటు చేశారు.

ఏపీలో ఇవాళ్టీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. సీఎం పర్యటనలో భాగంగా పాఠశాలను పరిశీలించే అవకాశం ఉండటంతో తరగతి గదులు, టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు తనిఖీ చేశారు. సీఎం ల్యాండ్ అయ్యే ఆదోని ఆర్ట్స్, అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో హెలిప్యాడ్ నుంచి సీఎం సభా ప్రాంగణం వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లన పర్యవేక్షించారు.

విద్యాదీవెన కిట్ల పంపిణీలో భాగంగా సీఎం జగన్ విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ తో పాటు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ అందచేయనున్నారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ప్రతి నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యా కానుక కిట్లను ప్రభుత్వం విద్యార్ధులకు అందచేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 40 వేల 421 మంది విద్యార్థులకు 931 కోట్ల వ్యయంతో జగనన్న విద్యా కానుక కిట్లు అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories