CM Jagan: కరోనా నుంచి చంద్రబాబు కోలుకోవాలని జగన్ ట్వీట్

CM Jagan: త్వరగా కోలుకొని, ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్

Rama Rao
Updated on: 5 April 2022 12:52 PM IST
CM Jagan Tweets Chandrababu Should Recover from Covid-19
X

కరోనా నుంచి చంద్రబాబు కోలుకోవాలని జగన్ ట్వీట్

CM Jagan: కరోనా నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వెల్లడించారు సీఎం జగన్. కరోనా నుంచి త్వరగా కోలుకొని,ఆరోగ్య వంతులుగా తిరిగి రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

తనకు కరోనా నిర్ధారణ అయిందని స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. సోమవారం చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని లోకేష్ తెలిపారు.





Rama Rao

Rama Rao

Next Story