అయోధ్య తీర్పు.. సీఎం జగన్ ట్వీట్..

అయోధ్య  తీర్పు.. సీఎం జగన్ ట్వీట్..
x
Highlights

అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద...

అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అందులో..

'అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని కోరుతున్నాను' అంటూ సీఎం తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories