రాష్ట్రాన్ని పాలించాల్సిన సీఎం ప్రొఫెసర్ గా మారారా.. కూల్ కూల్ గా తాను చెప్పాలనుకున్నది చెప్పారా?

రాష్ట్రాన్ని పాలించాల్సిన సీఎం ప్రొఫెసర్ గా మారారా.. కూల్ కూల్ గా తాను చెప్పాలనుకున్నది చెప్పారా?
x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ప్రొఫెసర్‌లా మారిపోయారు. విజయవాడలో నిర్వహించిన ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ప్రొఫెసర్‌లా మారిపోయారు. విజయవాడలో నిర్వహించిన ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు ప్రవేశపెట్టారో వివరించారు.

మన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అన్నారు. అంతేకాదు, ఎడ్యుకేషన్‌లో ప్రపంచ దేశాలతో భారత్‌‌ను ఆంధ్రప్రదేశ్‌ను పోల్చుతూ లెక్కలతో సహా వివరంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని పరిశీలిస్తే ఒక ప్రొఫెసర్‌ మాదిరిగా పాఠాలు చెబుతున్నట్లు కనిపించారు. సదస్సుకు హాజరైన అతిథులు కూడా స్టూడెంట్స్ లా మారిపోయి జగన్ స్పీచ్‌ను ఒక పాఠంలా శ్రద్ధగా విన్నారు.

కంప్యూటర్స్ లాంగ్వేజ్ ఏంటి? ఐపాడ్స్ లాంగ్వేజ్ ఏమిటి? ఇంటర్నెట్ లాంగ్వేజ్ ఏంటంటూ జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏలుతుందన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లగ్జరీ కాదని అందరికీ నెస్సెస్సరీ లాంగ్వేజ్ అన్నారు

ఒక తండ్రిగా నా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకుంటానని, అందుకే ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు. పేద విద్యార్ధులకు కూడా ఇంగ్లీష్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తాము తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్ధులు సైతం ప్రపంచంతో పోటీపడగలరని అన్నారు.

పేద విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నదని, అందుకే తాము ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అయితే, మాతృభాషకు అన్యాయం జరగకుండా తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేశామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories