logo
ఆంధ్రప్రదేశ్

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన .. ఏటీసీ టైర్స్‌ ప్రారంభం

CM Jagan Tour In Anakapalle District
X

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన .. ఏటీసీ టైర్స్‌ ప్రారంభం

Highlights

CM Jagan: ఇందులో భాగంగా ఈ ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ చేరుకుంటారు

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయల్దేరి, అక్కడ ఏటీసీ టైర్స్‌ పరిశ్రమను ప్రారంభించనున్నారు. జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్స్‌ పరిశ్రమను ఇక్కడి సెజ్ లో ఏర్పాటు చేశారు. ‎2వేల350 కోట్ల వ్యయంతో ప్లాంట్ నిర్మిస్తున్న తొలి యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే వాసుపల్లి కొడుకు సూర్య వివాహం జరిగిన ఈ నేపథ్యంలో సీఎం జగన్ వాసుపల్లి నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం తిరిగి విజయవాడకు బయల్దేరి వస్తున్నారు.

Web TitleCM Jagan Tour In Anakapalle District
Next Story