logo
ఆంధ్రప్రదేశ్

కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన

CM Jagan to Launch YSR  Matsyakara Bharosa | Telugu Latest News
X

కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన

Highlights

YS Jagan: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభించనున్న సీఎం జగన్

YS Jagan: కోనసీమ జిల్లాలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా వేట నిషేధ భృతి కింద అర్హులైన లక్షా 8వేల 755 కుటుంబాలకు సీఎం 109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ONGC పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23వేల 458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో 108 కోట్లు జమ చేయనున్నారు.

Web TitleCM Jagan to Launch YSR Matsyakara Bharosa | Telugu Latest News
Next Story