సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ఏపీలో మారిటైం బోర్డు ఏర్పాటు!

సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ఏపీలో మారిటైం బోర్డు ఏర్పాటు!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మారిటైం బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్‌...

ఆంధ్రప్రదేశ్ లో మారిటైం బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్‌ పోర్టుతోపాటు 14 నాన్‌ మేజర్‌ పోర్టుల అభివృద్ధిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్టణం సహా రాష్ట్రంలోని మేజర్ పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పోర్టుల ద్వారా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అధికారులకు వివరించారు.

తీరప్రాంత కారిడార్‌లో పరిశ్రమలను పెంచి పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఎగుమతులు, దిగుమతుల రంగంలో రాష్ట్రాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టాలని లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డు ద్వారా రాష్ట్రంలో పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులు ఎక్కువ జరుగుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories