
మండలిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై...
మండలిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు. దాంతో స్పీకర్ కూడా అలాగే చర్చిద్దామని అన్నారు. అమరావతి విభజనకు సంబంధించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మండలి రద్దు దిశగా అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఎంతో బాధ కలిగించాయని ముఖ్యమంత్రి అన్నారు.
మండలి చట్టబద్ధంగా వ్యహరిస్తుందని తామంతా నమ్మామని.. అయితే తమ తోపాటు ప్రజల నమ్మకాన్ని మండలి వమ్ము చేసిందని సీఎం పేర్కొన్నారు. నిన్న జరిగిన మండలి సభలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మనే చెప్పి.. మళ్ళీ సెలెక్ట్ కమిటీకి పంపించడం ఏమిటని ప్రశ్నించారు. చైర్మన్ తప్పు చేస్తున్నాడని చెబుతూ.. అయినా నేను తప్పు చేస్తున్నానని చైర్మన్ అన్నారని అన్నారు. మేము పాలకులం కాదు సేవకులం అన్న ముఖ్యమంత్రి.. చట్టాలు చేయడానికే అసెంబ్లీ ఏర్పాటైందని గుర్తుచేశారు. మండలి చైర్మన్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలని బుధవారం మండలిలో చైర్మన్ సభలో మాట్లాడిన మాటలను అసెంబ్లీలో వీడియో ప్రదర్శన రూపంలో ఇచ్చారు ముఖ్యమంత్రి.
మండలి అనేది సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఉందన్న సీఎం.. ప్రజల బాగోగుల కోసం తయారు చేసే బిల్లుల్ని అడ్డుకోవడానికి కాదని అన్నారు. మండలిలోని కాదు.. అసెంబ్లీలోను కూడా ఉన్నత వ్యక్తులు ఉన్నారని.. ఈ సందర్బంగా సభలో ఉన్న ఉన్నత చదువులు చదివిన వ్యక్తులను గుర్తుచేశారు సీఎం. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఉండగా మండలి అవసరం ఏముందని అన్నారు. మండలికోసం సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. ఇంతా ఖర్చు చేసినా ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడానికేనా అని అన్నారు. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రానికి ఉపయోగం లేని మండలి అవసరమా? అని పేర్కొన్నారు.
దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండలిలు ఉన్నాయని.. ప్రజలకు మంచి చేయడం కోసం మండలి అనేది ఉండాలి కానీ.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రూల్స్ తో సంబంధం లేకుండా ఉండే మండలిని కొనసాగించడం అవసరమా? అని అన్నారు. అంతేకాదు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదన్నసీఎం.. సీట్ అఫ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం డిసెంట్రలైజషన్ చెయ్యడానికి క్యాపిటల్ అనేది అవసరం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చొని పరిపాలన చెయ్యొచ్చని సీఎం జగన్ అన్నారు. పరిపాలన చెయ్యడానికి ఏ చట్టం ఏ తీర్మానం అవసరం లేదని.. ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు చట్టాలు చెయ్యొచ్చని ఆర్టికల్ 174 చెబుతుందని అన్నారు. హుద్దుద్ వచ్చినప్పుడు విశాఖలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు.
మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు సలహాలు మాత్రమే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ.. అని.. అయితే మన మండలి ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటుందన్నారు. ఇలాంటి మండలి మనకు అవసరమా అని పేర్కొంటూ.. సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై చర్చిద్దామని స్పీకర్ ను కోరారు. సీఎం ప్రసంగం అనంతరం స్పీకర్ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



