CM Jagan: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan Review On Adudam Andhra program
x

CM Jagan: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

Highlights

CM Jagan: పీవీ సింధు, రాయుడు, సాకేత్‌ వంటి క్రీడాకారులను వెలికితీయాలి

CM Jagan: ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిసెంబరు 26నుంచి ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. సీఎస్‌ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఇవాళ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం జగన్.. ప్రతి అడుగులోనూ అంచనాలను మించి పనిచేయగలిగామన్నారు. అందులో భాగంగానే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఆడుదాం ఆంధ్రా కోసం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9వేల 43 క్రీడా మైదానాలను గుర్తించగా... మైదానాలన్నీ సిద్ధంగా ఉన్నాయా ? లేదా? పనులు ఎంతవరకు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలోని 15వేల సచివాలయాలను ఒక కార్యక్రమంలో భాగం చేయడంతో పాటు, సచివాలయ స్ధాయి నుంచి క్రీడలను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు సీఎం జగన్.

ప్రతి సంవత్సరం ప్రతిభావంతులను వెదికిపట్టుకోగలిగితే... పీవీ సింధు, రాయుడు, సాకేత్‌ వంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతామన్నారు. పోటీలకు అవసరమైన ప్రతి కిట్‌ నాణ్యత పరీక్షించి గ్రామస్థాయికి పంపాలని ఆదేశించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ గేమ్స్‌లో రాష్ట్రస్ధాయిలో విజేతలకు 5లక్షలు, జిల్లా స్ధాయిలో 60వేలు, నియోజవర్గ స్ధాయిలో 35వేల నగదు ఇవ్వనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విజేతలకు రాష్ట్రస్ధాయిలో 2లక్షలు, జిల్లాస్ధాయిలో 35వేలు, నియోజకవర్గస్ధాయిలో 25వేల నగదు బహుమతి ఉంటుందన్నారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories