CM Jagan: ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan Review Of Revenue Department
x

CM Jagan: ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష

Highlights

CM Jagan: నాటుసారా తయారీ కుటుంబాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం

CM Jagan: ఏపీలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్నుల వసూళ్లు జూన్‌ వరకూ 91శాతం లక్ష్యం చేరినట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ వరకూ 7వేల 653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23వేల 74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.

నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద 16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు వెల్లడించగా..ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలని, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories