మరో ఐదేళ్లు ఇబ్బంది లేదన్నమాట..!

మరో ఐదేళ్లు ఇబ్బంది లేదన్నమాట..!
x
Highlights

బుధవారం ఉదయం 10.30కి ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

బుధవారం ఉదయం 10.30కి ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదులలో కాలుష్యం.. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఎన్జీవోలతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30కి పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజన పథకంపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఇసుక కొరత తీవ్రమైన నేపథ్యంలో చేపడుతున్న చర్యలపై సీఎం సమీక్షించనున్నారు.

మరోవైపు ప్రతిరోజూ 45 వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్టు గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల్లో నెలల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల ప్రధానమైన రీచ్‌ల నుంచి అనుకున్నంత ఇసుక సరఫరా జరగడం లేదని ఆయన చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కాగా వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో వరదలు తగ్గుముఖం పడితే ఇసుక కొరత లేకుండా చూడవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories