CM Jagan: సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష

CM Jagan Review Jagananna Arogya Suraksha
x

CM Jagan: సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష

Highlights

CM Jagan: ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవాలి

CM Jagan: సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. జగనన్న సురక్ష తరహాలోనే ఆరోగ్య సురక్ష చేపట్టాలని అధికారుల సమీక్షలో ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను తీసుకుంటున్నామని తెలిపారు. ఒక నిర్ణీత రోజున గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి పరీక్షలు చేయడంతో పాటు మందులు, కళ్లద్దాలు అందజేయాలని చెప్పారు.

ప్రతి ఇంటిలో ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలన్నది సూచిస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో 53,126 పోస్టులు భర్తీ చేశామన్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశామని చెప్పారు. 2.356 సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని జగన్ వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై రూపొందించిన బ్రోచర్‌ను జగన్ విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories