ఆంగ్ల మీడియంపై స్వల్ప మార్పులు.. వారికి మాత్రమే..

ఆంగ్ల మీడియంపై స్వల్ప మార్పులు.. వారికి మాత్రమే..
x
Highlights

ఏపీలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేనందున ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టడంలో స్వల్ప మార్పులు చేసింది ప్రభుత్వం. తొలిదశలో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకే...

ఏపీలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేనందున ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టడంలో స్వల్ప మార్పులు చేసింది ప్రభుత్వం. తొలిదశలో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాల్సిందిగా సూచించారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

14 నుంచి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories