నేడు అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

నేడు అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కొన్ని నిమిషాల క్రితం గన్నవరం విమానాశ్రమం నుంచి ప్రత్యేక విమానంలో అనంతపురం బయలుదేరారు. అనంతపురంలో నేతన్నలకు చేనేత భరోసా నగదును జగన్‌ పంపిణీ చేయనున్నారు.

తర్వాత ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గోనున్నారు. నేడు జగన్ పుట్టిన రోజు కావడంతో...సభా వేదికపైనే జన్మదిన వేడుకలను జరిపేందుకు వైసీపీ క్యాడర్ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి పయనం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories