CM Jagan: పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ

CM Jagan Met With Party Regional Coordinator
x

CM Jagan: పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ

Highlights

CM Jagan: రానున్న 2 నెలలపాటు బస్సు యాత్ర నిర్వహించేలా ప్రణాళిక

CM Jagan: పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ ఆయ్యారు. పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారాయన... బస్సుయాత్ర సమావేశాల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించారు వైస్‌.జగన్.

అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని, ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తం మూడు మీటింగులు ఏర్పాటు చేయాలని నేతకు దిశానిర్దేశం చేశారాయన... బస్సుయాత్ర అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని, మీటింగులు విజయవంతంగా జరిగేలా చూడాలి అని సీఎం జగన్ ఆదేశించారు.

స్థానిక ఎమ్మెల్యే గానీ, పార్టీ ఇంఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలని, 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించాలని నేతలకు వైఎస్ జగన్ సూచించారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని వైసీపీ చెబుతోంది. జరుగుతున్నది కులాల వార్‌ కాదని, ఇది క్లాస్‌ వార్‌ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్లాన్ చేశారు జగన్... పేద వాడు వైసీపీని ఓన్‌ చేసుకునే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధినేత ఆదేశించారు.

వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగాలని నిర్ణయించారాయన... విజయవాడ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై నియోజకవర్గాల స్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి.. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలని సూచించారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories