Top
logo

కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం

కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం
Highlights

కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం

నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాంకర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్టేట్ లెవెల్ బ్యాంకర్లు హాజరుకానున్నారు. వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా తోపాటు రైతులకు కొత్త రుణాలు వంటి విషయాలపై చర్చించనున్నారు. రైతుభరోసా కింద జమచేసి డబ్బును గత రుణాలకు చెల్లు వేయవద్దని కోరనున్నారు సీఎం. అలాగే వడ్డీలేని రుణాలు, ఈ ఏడాది ఇవ్వవలసినా, ఇచ్చిన బ్యాంకు రుణాలపై కూడా చర్చించనున్నారు.

మరోవైపు నిధుల సమీకరణలో ఆలస్యం అవుతున్నందున అక్టోబర్ 8న ప్రారంభమవుతుందనుకున్న రైతు భరోసా.. వారంరోజులు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని చేత ఈ పధకాన్ని ప్రారంభించాలని సీఎం భావిస్తున్నారు. కాగా రైతు భరోసా పధకంలో భాగంగా ప్రతి ఏటా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం.. రూ. 6500 , కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6000 కలిపి మొత్తం రూ.12500 ఇవ్వనుంది.

Next Story