'డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌'ను ప్రారంభించిన సీఎం జగన్‌

డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌
x
Highlights

కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ పటిష్టమై చర్యలు చేపడుతోంది. ప్రతి రోజూ సీఎం జగన్‌ పరిస్థతిని సమీక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ పటిష్టమై చర్యలు చేపడుతోంది. ప్రతి రోజూ సీఎం జగన్‌ పరిస్థతిని సమీక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. టెలీ మెడిసిన్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా 'వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌' కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వైద్యుడితో మాట్లాడారు సీఎం జగన్‌. అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

టెలీమెడిసిన్‌ కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 14410ను ప్రభుత్వం కేటాయించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టెలీమెడిసిన్‌లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తారు. 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories