CM Jagan: మార్పులు-చేర్పులు.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న సీఎం జగన్

CM Jagan Is Finalizing The Candidates To Win Once Again
x

CM Jagan: మార్పులు-చేర్పులు.. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న సీఎం జగన్

Highlights

CM Jagan: పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కసరత్తు వేగవంతం

CM Jagan: మరోసారి ఏపీలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన అధికార వైసీపీ.. ఇప్పుడు నాలుగో జాబితాను సిద్ధం చేస్తోంది. మార్పులు-చేర్పుల్లో భాగంగా.. సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు.

సీఎంవోకు ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకొని, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై ఎమ్మెల్యేలతో సజ్జల, ధనుంజయరెడ్డి చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సీఎం జగన్‌ నుంచి పిలుపు అందింది. దీంతో తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు. గతం కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై బాలినేని ఆగ్రహంగా ఉన్నారు. తనతో చర్చించకుండా మార్పులు చేస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ల నియామాకంలో.. తన మాట పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories