ఈనెల 14న పోలవరంకు సీఎం జగన్!

ఈనెల 14న పోలవరంకు సీఎం జగన్!
x
Highlights

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామన్న ఏపీ సర్కార్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది. నిధుల విషయంలో ఏర్పడిన గందరగోళంను క్లియర్ చేసేందుకు అటు కేంద్ర జల్‌శక్తి మంత్రి శాఖ కూడా సానుకూలంగా స్పందించింది.

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామన్న ఏపీ సర్కార్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది. నిధుల విషయంలో ఏర్పడిన గందరగోళంను క్లియర్ చేసేందుకు అటు కేంద్ర జల్‌శక్తి మంత్రి శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రాజెక్టు అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తామంటున్నారు మంత్రులు. ఇక ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. ఈనెల 14న పోలవరం వెళ్లనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు మారిన అంచనాలను ఆమోదించింది కేంద్ర జల్‌శక్తి శాఖ. దీంతో పోలవరం నిర్మాణానికి ఏర్పడిన నిధుల అడ్డంకి ఇక తొలగనుంది. శుక్రవారం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఆర్థిక మంత్రి బుగ్గన, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయి.. పోలవరం నిధుల విషయంపై చర్చించారు. నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 17న కేంద్ర మంత్రి ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టిపెట్టారు. 2021 డిసెంబర్ నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పోలవరాన్ని పూర్తిచేసి 2022 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

పోలవరం పనుల్లో వేగం పెంచేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 14న పోలవరం వెళ్లనున్న సీఎం.. నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories