మీ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు : సీఎం జగన్ ప్రశ్న

మీ పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారు : సీఎం జగన్ ప్రశ్న
x
Highlights

ఏపీలో ఒకటో తరగతి నుంచి ఆరవతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేనలు తీవ్రంగా...

ఏపీలో ఒకటో తరగతి నుంచి ఆరవతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ట్వీట్ ల మీద ట్వీట్ లు చేశారు.. దీంతో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు.. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

'అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే, ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం' అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories