CM Jagan: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ విచారం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం..

CM Jagan Expressed Regret over the Vijayawada Bus Accident
x

CM Jagan: విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ విచారం

Highlights

CM Jagan: మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

CM Jagan: విజయవాడ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై సీఎం జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం జగన్ అదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని...గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories