రామ్ జెఠ్మలాని మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి

రామ్ జెఠ్మలాని మరణంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి
x
Highlights

ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. జెఠ్మలాని దేదీప్యమానంగా వెలిగే న్యాయ...

ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. జెఠ్మలాని దేదీప్యమానంగా వెలిగే న్యాయ జ్యోతి వంటి వారని కితాబిచ్చారు. జెఠ్మలాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్, భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా ప్రముఖ న్యాయవాదిగా, కేంద్రమంత్రిగా, బీజేపీ సీనియర్ నేతగా రామ్ జెఠ్మలాని అందరికి సుపరిచితమే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఢిల్లీలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories