CM Jagan: సామాజిక న్యాయం.. సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం

CM Jagan Comments On BJP And TDP
x

CM Jagan: సామాజిక న్యాయం.. సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం

Highlights

CM Jagan: ఇది కురుక్షేత్ర సంగ్రామ యుద్దంb

CM Jagan: వైసీపీ... బీజేపీ, టీడీపీ ట్రయాంగిల్‌ పొలిటికల్‌ స్టోరీలో క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై జగన్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. వరుసగా రెండురోజులు ఇద్దరు అగ్రనేతలు ఏపీలో పర్యటించి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ అవినీతిమయమైపోయిందన్నారు.

ఎక్కడికక్కడ మాఫియాలు రెచ్చిపోతున్నాయన్నారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్‌గా కాక రేగింది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనే ఆసక్తి అందరిలో ఉన్న నేపథ్యంలో.. క్రోసూరు సభలో సీఎం జగన్ బీజేపీని టార్గెట్ చేశారు. ఇది కురుక్షేత్ర సంగ్రామ యుద్దమని..మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. మీకు మంచి జరిగితే.. మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండన్నారు. ప్రజలనే తాను నమ్ముకున్నానని... వాళ్లే తన బలం బలగమని కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories