ఆశా మాలవ్యకు అభినందించిన సీఎం జగన్.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సహకం

CM Jagan Announced a Cash incentive 10 lakhs to Asha Malaviya
x

ఆశా మాలవ్యకు అభినందించిన సీఎం జగన్.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సహకం

Highlights

CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆశా

CM Jagan: యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ పై ప్రయాణించే లక్ష్యంతో ఆమె ఇప్పటిదాకా 8 రాష్ట్రాల్లో పర్యటించింది. 8 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగించింది. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నది ఆశా మాలవ్య లక్ష్యం. ఆశా మాలవ్య ఆశయాలను తెలుసుకున్న సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. అంతేకాకుండా 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 24 ఏళ్ల ఆశా మాలవ్య స్వస్థలం మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లా నతారాం గ్రామం. ఆమె తన సైకిల్ యాత్రను గత ఏడాది నవంబరు 1న భోపాల్ లో ప్రారంభించింది. ఇటీవల తమిళనాడులో యాత్ర పూర్తి చేసుకుని చెన్నై మీదుగా ఏపీలోకి ప్రవేశించింది. ఆశా మాలవ్య గతంలో టెంజింగ్ ఖాన్, బిసిరాయ్ పర్వతాలను అధిరోహించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories