సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
x
Highlights

ఎట్టకేలకు ఏపీ హైకోర్టు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం వెల్లడించారు. కర్నూల్‌ జిల్లాలోనే హైకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు....

ఎట్టకేలకు ఏపీ హైకోర్టు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం వెల్లడించారు. కర్నూల్‌ జిల్లాలోనే హైకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాంతో రాయలసీమ పరిధిలోని అన్ని కేసులను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కర్నూల్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గతంలోనే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది శిలాఫలకాలుకూడా వేశారు.. అయితే తాను మాత్రం అలా కాదని.. ఏదైనా అభివృద్ధి పనికి శిలాఫలకం వేస్తే అదే రోజే ప్రారంభ తేదీ కూడా చెప్పి ..చెప్పిన ప్రకారం పనులు పూర్తి చేయించడమే టీడీపీ ప్రభుత్వ గొప్పతనం అన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఈ నిర్ణయం పట్ల రాయలసీమ పరిధిలోని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories