Top
logo

వైసీపీని బంగాళఖాతంలో కలపాలి : సీఎం చంద్రబాబు

వైసీపీని బంగాళఖాతంలో కలపాలి : సీఎం చంద్రబాబు
Highlights

మచిలీపట్నం పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు పనులను ప్రారంభించిన...

మచిలీపట్నం పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం డీప్‌ వాటర్‌ పోర్టు పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేతలపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. బందరు పోర్టును వైసీపీ వ్యతిరేకిస్తోంది... ఆపార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించి బంగాళఖాతంలో కలపాలంటూ మండిపడ్డారాయన. వైసీపీ లాంటి ప్రతిపక్షం రాష్ట్రంలో అవసరమా అని అన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడేది లేదని అన్నారు. జవాబు దారితనంతో పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు బాబు. రాష్ట్రాంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేశామని, అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే దొంగ జగన్‌ అని చంద్రబాబు అన్నారు.

Next Story